బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తమిళనాడు ప్రజల ఆస్తిగా మారిన హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ చెన్నై పాలవాక్కం ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన చర్య ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాధారణ డ్రెస్సులో, చిన్న కారులో వచ్చి విజయ్ గారు విగ్రహానికి పూలమాల వేసి గౌరవం తెలిపారు. ముందుగా ఎలాంటి మీడియా సమాచారం లేకుండా వచ్చిన ఆయనకు అక్కడ ఉన్న అభిమానులు, ప్రజలు ఆశ్చర్యపోయారు.
విజయ్ గారి ఈ సాదాసీభమైన నివాళి కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది. అంబేడ్కర్ గారి సేవలకు తన నివాళిని తెలియజేసేలా విజయ్ వ్యవహరించిన తీరు ప్రశంసలకు గురవుతోంది. అభిమానులు ‘ఇదే నిజమైన నాయకత్వ లక్షణం’ అని కామెంట్లు చేస్తున్నారు.
అంబేడ్కర్ జయంతి రోజు ఇలా ప్రజల మధ్యకు వచ్చి, ఎలాంటి హంగులు లేకుండా గౌరవం తెలపడం ద్వారా విజయ్ తన రాజకీయ పయనాన్ని కూడా జనాలకు చేరువ చేసే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.