రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 62 పరుగులు చేసిన కోహ్లీ అదరగొట్టాడు. ఆర్‌సీబీ విజయంలో అతని ఇన్నింగ్స్ కీలకంగా నిలిచింది. కానీ అర్ధశతకం పూర్తయిన అనంతరం అతని హావభావాలు ఒక్కసారిగా అభిమానులను ఆందోళనకు గురిచేశాయి.
బ్యాటింగ్ చేస్తూ 54 పరుగుల వద్ద కోహ్లీ ఒక్కసారిగా గుండె పట్టుకున్నాడు. కొద్దిసేపు శ్వాస సమస్యతో ఇబ్బంది పడినట్లు కనిపించడంతో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ దగ్గా వెళ్లి, కోహ్లీ హార్ట్ బీట్ చెక్ చేయాల్సిందిగా కోరాడు. సంజూ అతని ఛాతిపై చేయి పెట్టి చూసాడు.
అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ఫిట్ క్రికెటర్లలో కోహ్లీ ఒకరు. అలాంటి ఆటగాడు ఇలా మధ్య ఇన్నింగ్స్‌లో అసహజంగా ప్రవర్తించడం అభిమానుల్లో కలవరం కలిగించింది. అయితే కోహ్లీ తిరిగి ఆట కొనసాగించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ నుంచి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోహ్లీ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.