Tuesday, August 4, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTKorean Kanakaraju  | వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు సెన్సార్ పూర్తి.. విడుదలకు సిద్ధం

Korean Kanakaraju  | వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు సెన్సార్ పూర్తి.. విడుదలకు సిద్ధం

-

Chat on WhatsApp

Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’(Korean Kanakaraju) విడుదలకు సిద్ధమైంది. వినూత్నమైన కథలు, ఎంటర్‌టైనింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మెర్లపాక గాంధీ ఈ సినిమాను తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాగా, చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. దాదాపు 2 గంటల 36 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెన్సార్ తర్వాత సినిమాపై పాజిటివ్ స్పందనలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్, సత్యతో కలిసి చేసే వినోదాత్మక సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర బృందం చెబుతోంది. భిన్నమైన సంస్కృతుల నేపథ్యంలో రూపొందిన ఈ కథలో కామెడీ, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ సమపాళ్లలో ఉండనున్నట్లు సమాచారం. మెర్లపాక గాంధీ ప్రత్యేకమైన కథన శైలికి తోడు, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్. వరుణ్ తేజ్‌కు ఈ చిత్రం మంచి విజయాన్ని అందిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

E20 Petrol Quality Check: Government Clarifies Fuel Standards and Safety Measures

E20 పెట్రోల్ సేఫేనా?.. కేంద్రం చెప్పిన కీలక విషయాలు ఇవే

E20 Petrol Quality Check: E20 పెట్రోల్‌పై నెలకొన్న అపోహలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు అందించే ఇంధనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చమురు సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని...
- Advertisement -
Chat on WhatsApp