LIVE
Sunday, November 22, 2026
LIVE
LIVE

EAGLE Team | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం.. ఈగల్ టీమ్ దాడులతో సంచలనం

by Bajaswamy
21 views

EAGLE Team: హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మరోసారి డ్రగ్స్ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది. క్యాంపస్‌లో గంజాయి సరఫరా జరుగుతోందన్న సమాచారంపై పోలీసులు, ఈగల్ టీమ్ చేపట్టిన దర్యాప్తులో మాజీ విద్యార్థి అరెస్టు కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో క్యాంపస్‌లో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి గోపన్‌పల్లిలో నివాసముంటూ యాక్టర్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. యూనివర్సిటీ మెన్స్ హాస్టల్-ఎల్‌లో గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఓ విద్యార్థి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున 10 గ్రాముల ఎండు గంజాయి విక్రయించినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ సమయంలో అతడి వద్ద నుంచి 5 గ్రాముల గంజాయిని ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో గంజాయి సరఫరా వెనుక ఉన్న ప్రధాన ముఠా, క్యాంపస్‌లో మరికొందరి ప్రమేయం, సరఫరా మార్గాలపై గచ్చిబౌలి పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఇదే సమయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ నిర్వహించిన పరీక్షల్లో 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More