Sunday, July 5, 2026
Chat on WhatsApp
HomeNationalUGC NET June 2026 | విద్యార్థులకు మరో ఛాన్స్...యూజీసీ నెట్ దరఖాస్తు గడువు పెంపు

UGC NET June 2026 | విద్యార్థులకు మరో ఛాన్స్…యూజీసీ నెట్ దరఖాస్తు గడువు పెంపు

-

Chat on WhatsApp

UGC NET June 2026: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే యూజీసీ నెట్ జూన్ 2026 సెషన్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో ఛాన్స్ ఇచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ మే 20తో ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని గడువును మే 23, 2026 వరకు పొడిగించారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ అప్లికేషన్‌ను సమర్పించుకోవాలని అధికారులు సూచించారు.

ఈ ఏడాది యూజీసీ నెట్ పరీక్షలను జూన్ 22 నుంచి జూన్ 30 వరకు నిర్వహించనున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించేందుకు, అలాగే పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఈ పరీక్ష కీలకంగా ఉంటుంది. ఎన్టీయే ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

మొత్తం 85 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ-ఎన్‌సీఎల్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉన్నా అర్హత ఉంటుంది.

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. జనరల్ అభ్యర్థులకు రూ.1150, జనరల్-ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.325గా నిర్ణయించారు. మే 25 నుంచి 27 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకునే అవకాశం కల్పించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp