అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నినాదాలకంటే చర్యలే తీవ్రంగా మారాయి. ఇతర దేశాలు తమ దేశాన్ని దోచుకుంటున్నాయని భావించి, సుంకాల పేరుతో భయపెట్టే దూకుడు సాగించారు. ముఖ్యంగా చైనాపై వందల శాతం పన్నులతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, చైనా మాత్రం అదే తీరులో తిరుగుబాటు చూపింది. ఇది వరుసగా అమెరికాపై ప్రభావాన్ని చూపిస్తోంది.
చైనా ఎగుమతులను అమెరికా ఆపే ప్రయత్నం చేసినా, చైనా మాత్రం మళ్లీ కొత్త మార్గాలను అన్వేషించింది. పన్నులు ఎక్కువగా వేసిన అమెరికాకు బదులు, చైనా ఇతర దేశాల్లోకి వస్తువులను ఎగుమతి చేసి, అక్కడి నుంచి ముద్ర వేసి అమెరికాకు పంపుతోంది. ఇది చైనాకు ఉన్న వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తోంది. ట్రంప్ ప్లాన్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బగా మారింది.
చైనా నుంచి అమెరికాకు వచ్చే అరుదైన ఖనిజాలు, ప్రత్యేక వనరులు ఇక లభించకపోతే.. అమెరికా కీలక పరిశ్రమలు మోకరించాల్సిన పరిస్థితి. ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ పరికరాల తయారీలో ఈ వనరులు కీలకం. చైనా వాటిని ఎగుమతి చేయకుండా నిర్ణయించడంతో.. అమెరికా ఆందోళనకు గురైంది. ఇది చైనాతో పెద్ద డీల్ అవసరమని ట్రంప్ భావించేలా చేసింది.
ప్రస్తుతం అమెరికా చైనాతో తిరిగి చర్చలకు సిద్ధమవుతోంది. ట్రంప్ వేసిన పన్నుల విధానం తిరుగులేని బదులు తిన్నట్లయింది. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టే స్థాయిలో ఉన్న అమెరికా, ఇప్పుడు చైనా ఒత్తిడికి తలవంచినట్లైంది. పరిస్థితిని చూస్తే.. గెలిచిందెవరు? అనే ప్రశ్నకు సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది.