Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeNationalTMC | తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ... కీలక నేత పార్టీకి గుడ్‌బై

TMC | తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ… కీలక నేత పార్టీకి గుడ్‌బై

-

Chat on WhatsApp

TMC: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల అనంతరం పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో సీనియర్ నాయకులు వరుసగా రాజీనామాల బాట పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో టీఎంసీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ చిక్‌బరైక్ తన పార్టీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన నిర్ణయం పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇటీవలే టీఎంసీకి చెందిన సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో, ప్రకాష్ చిక్‌బరైక్ కూడా అదే బాటలో నడవడం గమనార్హం.

దీంతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభలో టీఎంసీ బలం మరింత తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, రానున్న రోజుల్లో మరికొందరు టీఎంసీ ఎంపీలు కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ అదే జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి మరింత రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీని వీడిన పలువురు ప్రజాప్రతినిధులు త్వరలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో చేరే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp