Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshTirumala | తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం.. ఈ నెల 26 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు...

Tirumala | తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం.. ఈ నెల 26 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు రద్దు

-

Chat on WhatsApp

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి 28 వరకు సాలకట్ల జ్యేష్టాభిషేకం(Salakatla Jyeshtabhishekam) వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జ్యేష్ట మాసంలో జ్యేష్ట నక్షత్రం ముగిసే సమయంలో మూడు రోజులపాటు నిర్వహించే ఈ ప్రత్యేక క్రతువు తిరుమల సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన ఉత్సవంగా పరిగణించబడుతుంది.

జ్యేష్టాభిషేకం సందర్భంగా సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయ క్రతువు అభిద్యేయక అభిషేకం అని కూడా ప్రసిద్ధి చెందింది. తరతరాలుగా జరిగే ఈ సంప్రదాయం ద్వారా ఉత్సవమూర్తులపై జరిగే నిరంతర అభిషేకాల వల్ల కలిగే అరిగిపోవడం తగ్గించి, వాటి పరిరక్షణ కోసం ప్రత్యేక కవచాలను అలంకరించడం జరుగుతుంది. ఉత్సవం ప్రారంభ దినాన శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తొలగించి, పంచామృత స్నపన తిరుమంజనం, హోమాలు నిర్వహించిన అనంతరం వజ్ర కవచాన్ని అలంకరిస్తారు. రెండవ రోజు ముత్యాల కవచంతో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి.

మూడవ రోజు తిరుమంజనాది కార్యక్రమాలు పూర్తిచేసి, తిరిగి బంగారు కవచాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని తరువాతి జ్యేష్టాభిషేకం వరకు అలాగే ఉంచడం సంప్రదాయం. జ్యేష్టాభిషేకం కారణంగా ఈ నెల 28న కళ్యాణోత్సవం(Kalyanotsavam), ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp