Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsTiago 2026 | ఒకే కారు... ఎన్నో లాభాలో తెలుసా ? టాటా టియాగో 2026...

Tiago 2026 | ఒకే కారు… ఎన్నో లాభాలో తెలుసా ? టాటా టియాగో 2026 ఫీచర్లు, ధరలు ఇవే

-

Chat on WhatsApp

Tiago 2026: టాటా మోటార్స్ తన అత్యంత బడ్జెట్-ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్ టియాగో 2026 వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ సెగ్మెంట్‌లో పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ (EV) పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న ఏకైక కారు ఇదే కావడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

కొత్త టియాగో ప్రారంభ ధరను కంపెనీ రూ.4.69 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. పెట్రోల్ టాప్ వేరియంట్ ధర రూ.7.29 లక్షల వరకు ఉండగా, సీఎన్‌జీ వేరియంట్లు రూ.5.79 లక్షల నుంచి రూ.7.99 లక్షల మధ్య అందుబాటులో ఉన్నాయి. టియాగో ఈవీ ప్రారంభ ధర రూ.6.99 లక్షలు కాగా, BaaS ఆప్షన్‌తో మరింత తక్కువ ధరకు పొందే అవకాశం ఉంది.

సేఫ్టీ పరంగా ఈ కొత్త మోడల్‌ను మరింత బలంగా తీర్చిదిద్దినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. క్రాష్ సేఫ్టీని చూపించేలా డ్యూయల్ ఇంపాక్ట్ డెమోను కూడా ప్రదర్శించింది. ప్రతి వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా ఉండటం ముఖ్య హైలైట్‌గా నిలిచింది.

డిజైన్ పరంగా గుంతల రోడ్లపై సులభంగా ప్రయాణించేలా ఈ కారును అభివృద్ధి చేశారు. ఇంటీరియర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. AMT వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్ కూడా అందించారు.

టియాగో ఈవీకి లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. కేవలం 30 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ చేసే అవకాశం ఉంది.

ఇంజిన్ విషయానికి వస్తే, 1.2 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్ పెట్రోల్ వేరియంట్‌లో 86 హెచ్‌పి, సీఎన్‌జీ వేరియంట్‌లో 75.5 హెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త టియాగో మారుతి వ్యాగనార్, సెలెరియో, హ్యుందాయ్ i10 వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp