Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTelanganaRevanth Reddy | జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కేబినెట్ కసరత్తు.. ఎవరికి మంత్రి పదవి.. ఎవరికి...

Revanth Reddy | జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కేబినెట్ కసరత్తు.. ఎవరికి మంత్రి పదవి.. ఎవరికి శాఖల మార్పు?

-

Chat on WhatsApp

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ(Telangana Cabinet Expansion) అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన జాతీయ రాజధానికి వెళ్లారు.

నేడు జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన పరిణామాలపై ఏఐసీసీ నాయకత్వంతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చలు జరిగే అవకాశముంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి మంత్రివర్గ ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకత్వం అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీతో పాటు కొన్ని శాఖల పునర్విభజనపై కూడా చర్చలు జరిగే అవకాశమున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రస్తుత మంత్రుల శాఖల్లోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశముందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఎవరికి పదోన్నతి లభించనుంది, ఎవరికి కీలక శాఖలు దక్కనున్నాయి, ఎవరికి మార్పులు తప్పవన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.

అయితే కేబినెట్ విస్తరణపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ సీఎం ఢిల్లీ పర్యటన అనంతరం ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp