Monday, August 3, 2026
Chat on WhatsApp
HomeSportsT20 World Cup 2026 Super 8 | టీమ్ఇండియా vs సఫారీ హై వోల్టేజ్...

T20 World Cup 2026 Super 8 | టీమ్ఇండియా vs సఫారీ హై వోల్టేజ్ పోరు…ఓడిస్తారా ?

-

Chat on WhatsApp


T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్‌ దక్షిణాఫ్రికాను ఓడించి 17 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా నిలిచిన సంగతి క్రికెట్ అభిమానులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2026(T20 World Cup 2026) సూపర్-8 దశలో మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి. రెండేళ్ల క్రితం ఫైనల్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సఫారీ జట్టు ఉత్సాహంగా ఉంది. అదే సమయంలో భారత్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని చూపించాలని ఆరాటపడుతుంది.

దక్షిణాఫ్రికా గ్రూప్ దశలో నాలుగు మ్యాచుల్లో నాలుగు విజయాలతో సూపర్-8కు చేరింది. కెప్టెన్ ఐడెం మార్కరం  (Aiden Markram) 178 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. బౌలింగ్ విభాగంలో మార్కో యాన్సెన్ తన ఎత్తు, స్వింగ్‌తో ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెడతాడు. Anrich Nortje వేగవంతమైన బౌలింగ్‌తో ఒత్తిడి తీసుకొస్తాడు. కేశవ్ మహారాజ్ స్పిన్ బౌలింగ్‌తో కీలక వికెట్లు సాధించే నైపుణ్యం కలవాడు. మొత్తంగా వీరి బౌలింగ్ దళం ఏ జట్టుకైనా గట్టి సవాల్ విసరగలదు.

భారత్‌ కూడా అద్భుత ఫామ్‌లో ఉంది. గత రెండు టీ20 సిరీస్‌ల్లో సఫారీలపై విజయం సాధించింది. Tilak Varma, Varun Chakravarthy కీలక పాత్ర పోషించారు. Ishan Kishan 176 పరుగులతో రాణిస్తుండగా, Suryakumar Yadav, Hardik Pandya మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉంది. బౌలింగ్‌లో Jasprit Bumrah, Axar Patel కీలకం.

ఇషాన్-అభిషేక్ వర్సెస్ యాన్సెన్‌, సూర్య వర్సెస్ మహరాజ్‌, మార్‌క్రమ్ వర్సెస్ బుమ్రా వంటి ద్వంద్వ పోరులు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించనున్నాయి. జట్టు కూర్పు, స్పిన్నర్ల వినియోగం, డెత్ బౌలింగ్‌ — ఇవే ఈ హై వోల్టేజ్ పోరుకు తుది ఫలితాన్ని నిర్ధారించనున్న అంశాలు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Pawan Kalyan Congratulates Team India for Winning 39 Medals at Commonwealth Games 2026

Pawan Kalyan | 39 పతకాలు.. ఒకే త్రివర్ణ పతాకం.. టీమ్ ఇండియాకు పవన్...

Pawan Kalyan: కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games)2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో దేశ గౌరవాన్ని ప్రపంచ వేదికపై చాటారు. 39 పతకాలతో భారత్ విజయవంతమైన ప్రయాణాన్ని ముగించగా, ఈ ఘనతపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి...
- Advertisement -
Chat on WhatsApp