Matangi Swarnalatha: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ప్రధాన ఆకర్షణగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత(Matangi Swarnalatha) అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. పచ్చికుండపై నిలబడి అమ్మవారు పూనగా, వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో రంగం కార్యక్రమాన్ని వీక్షించి ఆశీస్సులు పొందారు. భవిష్యవాణిలో అమ్మవారు తనకు విగ్రహ ప్రతిష్ఠ చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “నేను సంతోషంగా రాలేదు.. ఆగ్రహంతో వచ్చాను. రెండేళ్లుగా నా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెబుతున్నా, ఇప్పటికీ ఆ పని పూర్తి చేయలేదు. అయినా మీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నేను కాపాడుతున్నాను. కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు” అంటూ హెచ్చరించారు. మరో ఆరు నెలల్లో తన విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని అమ్మవారు హెచ్చరించారు. తన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని అమ్మవారు భవిష్యవాణిలో వెల్లడించినట్లు భక్తులు విశ్వాసంతో స్వీకరించారు.
ALSO READ: Ujjaini Mahankali Rangam 2026 | ఉజ్జయిని మహంకాళి రంగంలో అమ్మవారి భవిష్యవాణి.. భారీ వర్షాలపై హెచ్చరిక








