Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeNationalSupreme Court | SIR ప్రక్రియ రాజ్యాంగబద్ధమే... ఈసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Supreme Court | SIR ప్రక్రియ రాజ్యాంగబద్ధమే… ఈసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు

-

Chat on WhatsApp

Supreme Court: ఓటరు జాబితా పునర్విమర్శ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎన్నికల సంఘం అధికారాలను సమర్థించింది. బుధవారం వెలువడిన తీర్పులో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఓటర్ల జాబితాల సవరణలో భాగంగా చేపట్టిన SIR ప్రక్రియ ఎలాంటి చట్టాలను లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. వివిధ రాజకీయ పార్టీలు, రాష్ట్రాలు SIR ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు, ఎన్నికల సంఘం తన చట్టబద్ధ అధికారాల పరిధిలోనే వ్యవహరించిందని తేల్చింది.

SIR ప్రక్రియ కచ్చితమైన, సమగ్రమైన ఓటర్ల జాబితా తయారీకి కీలకమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఇది రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని వ్యాఖ్యానించింది. సాధారణంగా నిర్వహించే విధానానికి భిన్నంగా ఉన్నందుకే దీనిని అధికారాలకు అతీతమని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది.

SIR ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యం ఎన్నికల పారదర్శకతను మరింత బలోపేతం చేయడమేనని తెలిపింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా SIR ప్రక్రియ చుట్టూ కొనసాగుతున్న రాజకీయ, న్యాయ వివాదాలకు ముగింపు పలికినట్టైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp