స్టాక్ మార్కెట్ ఊగిసలాట – సెన్సెక్స్ నష్టాల్లో, నిఫ్టీ స్థిరం

Global market pressures led to a weak start in Indian stocks, with IT sector selling weighing on indices.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తొలుత నష్టాలను ఎదుర్కొన్నా, తర్వాత లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఐటీ రంగంలోని ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ల అమ్మకాల కారణంగా మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 76,345 వద్ద, నిఫ్టీ 1 పాయింటు లాభంతో 23,183 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం 86.20 వద్ద కొనసాగుతోంది. అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.22 శాతం, నాస్‌డాక్ 0.33 శాతం నష్టపోయాయి. ఈ ప్రభావం భారత మార్కెట్‌పై కూడా చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఆచితూచి ట్రేడింగ్ చేస్తున్నారని, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెన్సెక్స్, నిఫ్టీ మధ్యాహ్నం వరకు స్థిరత సాధిస్తాయా లేక మరింత నష్టాలు చూడాల్సి వస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *