Saturday, February 28, 2026
No menu items!
Google search engine
HomeBusinessStellantis reports | స్టెల్లాంటిస్‌కు 22.3 బిలియన్ యూరోల భారీ నష్టం

Stellantis reports | స్టెల్లాంటిస్‌కు 22.3 బిలియన్ యూరోల భారీ నష్టం

- Advertisement -
Google search engine

Stellantis reports: అంతర్జాతీయ ఆటో దిగ్గజం స్టెల్లాంటిస్‌ కు 2025లో భారీ దెబ్బ తగిలింది. కంపెనీ 22.3 బిలియన్ యూరోల నికర నష్టాన్ని ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన సంస్థల్లో నమోదైన రెండో అతిపెద్ద నష్టంగా ఇది నిలిచింది. 25.4 బిలియన్ యూరోల అసాధారణ చార్జీలు ఆర్థిక ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఉత్పత్తి వ్యూహంలో మార్పులు చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది.

కంపెనీ ఆదాయం 2% తగ్గి 153.5 బిలియన్ యూరోల వద్ద నిలిచినా, వాహనాల విక్రయాలు 5.48 మిలియన్ యూనిట్లకు పెరిగాయి. మారకపు విలువల మార్పులు, ధరల తగ్గింపు వ్యూహం ఆదాయాన్ని ప్రభావితం చేశాయి.

మాజీ సీఈఓ టవారెస్ స్థానంలో గత జూలైలో ఆంటోనియో బాధ్యతలు స్వీకరించి లాభదాయకత పునరుద్ధరణపై దృష్టి పెట్టారు.

అమెరికాలో అమ్మకాలు 39% పెరగడం కొంత ఊరటనిచ్చింది. 2026 నాటికి నికర అమ్మకాలు మెరుగుపడి స్వల్ప సానుకూల మార్జిన్ సాధిస్తామని కంపెనీ అంచనా వేసింది.

అయితే అమెరికా టారిఫ్‌లు, మార్కెట్ అస్థిరతల ప్రభావంతో 2025లో 1.2 బిలియన్ యూరోలు, 2026లో 1.6 బిలియన్ యూరోలు అదనపు నష్టం వాటిల్లవచ్చని హెచ్చరించింది. డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం కూడా సంస్థపై పడనుంది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular