Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeBusinessSensex Today | భారీ పతనంలో ముగిసిన సెన్సెక్స్

Sensex Today | భారీ పతనంలో ముగిసిన సెన్సెక్స్

-

Chat on WhatsApp

Sensex Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. BSE Sensex ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయి చివరకు 961.42 పాయింట్ల నష్టంతో 81,287.19 వద్ద స్థిరపడింది. ఉదయం 82,220 వద్ద ప్రారంభమైన సూచీ రోజంతా ఒడిదుడుకులకు లోనై, చివర్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో 81,159 కనిష్ఠాన్ని తాకింది.

NIFTY 50 కూడా 25,200 దిగువకు చేరింది. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియాలిటీ, ఫార్మా రంగాల్లో అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి.

బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు ఆవిరై రూ.463 లక్షల కోట్లకు చేరింది. రూపాయి విలువ డాలరుతో పోలిస్తే 11 పైసలు క్షీణించి 91.02కు పడిపోయింది. Bharti Airtel, Bajaj Finserv, Mahindra & Mahindra, Maruti Suzuki షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో Brent Crude బ్యారెల్ ధర 71 డాలర్ల వద్ద కొనసాగింది.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,465 కోట్ల విలువైన షేర్లు విక్రయించడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్ల బలహీన ధోరణి, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp