Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeBusinessStock Market | యుద్ధం మధ్య మార్కెట్ ట్రేడింగ్...దూసుకుపోతున్న సూచీలు

Stock Market | యుద్ధం మధ్య మార్కెట్ ట్రేడింగ్…దూసుకుపోతున్న సూచీలు

-

Chat on WhatsApp

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలతో రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ, సెన్సెక్స్ ఒక దశలో 900 పాయింట్లకు పైగా ఎగబాకింది. ఉదయం 9.36 గంటల సమయంలో సెన్సెక్స్ 895 పాయింట్ల లాభంతో 75,123 వద్ద ట్రేడవుతోంది.

నిఫ్టీ సూచీ 292 పాయింట్ల పెరుగుదలతో 23,294 వద్ద ఉంది. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి, అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరియు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టంలో ఉన్నాయి

అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినప్పటికీ, ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌లో ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలు లాభాలు నమోదు చేస్తున్నాయి.

రూపాయి కూడా ఈ సమయంలో పతనమైంది. ఉదయం ఒక దశలో రూ.93.08 వద్దకు చేరి, 19 పైసలు విలువ కోల్పోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నగదు వెనక్కి తీసుకోవడంతో రూపాయి పతనం కొనసాగుతోంది.

ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. నిన్న కూడా రూపాయి 49 పైసల నష్టంతో రూ.92.89 వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Prime Minister Narendra Modi urges citizens to support handloom weavers on National Handloom Day.

PM Narendra Modi | ఒక్క చేనేత వస్త్రం కొనండి.. నేతన్నలకు అండగా నిలవండి:...

PM Narendra Modi: దేశీయ చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని(National Handloom Day) పురస్కరించుకుని విడుదల చేసిన...
- Advertisement -
Chat on WhatsApp