ఎపీలోని పుట్టపర్తిలో మంగళవారం సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో నిర్వహించిన రథోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన 31.8 అడుగుల ఎత్తైన వెండి రథంపై బంగారు సత్యసాయి విగ్రహాన్ని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు.
ALSO READ: Is iBomma Ravi a Robin Hood? పైరసీకి సమర్థనపై పెద్ద చర్చ
ఈ భారీ రథం తయారీకి మొత్తం 180 కిలోల వెండిని ఉపయోగించగా, దీనిపై కూడ కిలో బంగారం పూతనిచ్చారు. ఉత్సవాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సత్యసాయి బాబా విగ్రహం మొత్తం “9.2 కిలోల బంగారంతో” రూపొందించబడింది.
శత జయంతి సందర్భంగా ఇలాంటి భారీ స్థాయి రథోత్సవం నిర్వహించడం భక్తుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తించింది.
