Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeInterNationalRobert F. Kennedy Jr | పాము కాటుకు గురైన అమెరికా ఆరోగ్య మంత్రి...వీడియో వైరల్

Robert F. Kennedy Jr | పాము కాటుకు గురైన అమెరికా ఆరోగ్య మంత్రి…వీడియో వైరల్

-

Chat on WhatsApp

పాములు పట్టబోయి కాటుకు గురైన అగ్రరాజ్యానికి చెందిన అమెరికా మంత్రి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళితే…అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నడీ జూనియర్(Robert F. Kennedy Jr) మరోసారి తన ప్రత్యేక చర్యలతో వార్తల్లో నిలిచారు.

ఈసారి ఆయన పాములను ఒట్టిచేతులతో పట్టుకునే ప్రయత్నంలో పాము కాటుకు గురయ్యారు. ఫ్లోరిడాలో ప్రముఖ డాక్టర్ ఓజ్ ఇంట్లోకి రెండు బ్లాక్ రేసర్ సర్పాలు ప్రవేశించాయి. వాటిని పట్టుకునేందుకు వెళ్లిన కెన్నడీ, రెండు పాములను చేతులతో పట్టుకున్నారు. ఆ సమయంలో వాటిలో ఒక పాము ఆయన ఎడమ చేతిని కాటేసింది.

ఈ ఘటనతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఆ పాము విషపూరితం కాకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కెన్నడీ మాత్రం ఎలాంటి భయమూ లేకుండా పాములను పట్టుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. ఇదే కాకుండా కెన్నడీ గతంలో కూడా వన్యప్రాణులపై తన ఆసక్తి కారణంగా వార్తల్లో నిలిచారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp