RGV on Rajamouli Controversy | వివాదంపై ఆర్జీవీ ట్వీట్…దేవుణ్ని నమ్మకపోవడం కూడా హక్కే

RGV reacts to Rajamouli’s Hanuman comments controversy RGV reacts to Rajamouli’s Hanuman comments controversy

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ‘వారణాసి’ ఈవెంట్‌లో చేసిన “దేవుణ్ని నమ్మను” హనుమంతుని నమ్మను అనే వ్యాఖ్యలు దుమారం రేపాయి. హనుమాన్‌పై మాట్లాడిన రాజమౌళిని కొన్ని హిందూ సంస్థలు, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తుండగా, ఈ  నేపథ్యంలో రాజమౌళి వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసారు.

రాజమౌళిని టార్గెట్ చేస్తున్న వారిపై ఆర్జీవీ సోషల్ మీడియాలో ఫైర్ అయ్యాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నమ్మకపోవడం కూడా ఒక వ్యక్తిగత హక్కే అని స్పష్టం చేశాడు.

ALSO READ:క్రేన్ కూలి టీచర్ జోష్నా మృతి….విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత

“గ్యాంగ్‌స్టర్ సినిమా తీయడానికి గ్యాంగ్‌స్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. దెయ్యం సినిమా తీయడానికి దెయ్యం అవ్వాలి అన్నది కాదు. అదేలా అయితే దేవుణ్ని నమ్మకపోయినా ఆయనపై సినిమా తీయొచ్చు కదా?” అని విమర్శకులపై సెటైర్ వేశాడు.

దేవుడు నాస్తికుల స్థితిని తగ్గించడం లేదని, అసలు సమస్య రాజమౌళి నమ్మకం కాదని, నమ్మకుండానే ఆయన సాధించిన సక్సెస్‌ కొందరికి ఇబ్బందిగా అనిపిస్తోందని ఆర్జీవీ కౌంటర్ ఇచ్చాడు.

“దేవుడు బాగున్నాడు రాజమౌళి బాగున్నాడు అర్థం చేసుకోలేని వాళ్లకే సమస్య” అంటూ ఈ వివాదానికి క్లియర్ ఫుల్ స్టాప్ పెట్టేలా వ్యాఖ్యానించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *