Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeBusinessRBI | యూపీఐ లావాదేవీలకు ఒక గంట ఆలస్యం.. ఆర్బీఐ కీలక ప్రతిపాదన

RBI | యూపీఐ లావాదేవీలకు ఒక గంట ఆలస్యం.. ఆర్బీఐ కీలక ప్రతిపాదన

-

Chat on WhatsApp

డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక భద్రతా చర్యలను ప్రతిపాదించింది. రూ.10,000 కంటే ఎక్కువ విలువ గల డిజిటల్ లావాదేవీలకు ఒక గంట ఆలస్యం విధించే కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా యూపీఐ వంటి అకౌంట్-టు-అకౌంట్ ట్రాన్స్ఫర్లకు ఇది వర్తించే అవకాశం ఉంది.

ఈ విధానం ప్రకారం డబ్బు పంపిన వెంటనే గ్రహీత ఖాతాలోకి చేరకుండా, తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.

ఈ ఒక గంట సమయాన్ని వినియోగదారులకు “రివర్స్ లేదా క్యాన్సిల్” చేసే అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించేందుకు ఇది సహాయపడుతుందని ఆర్బీఐ భావిస్తోంది.

అదే సమయంలో బ్యాంకులు కూడా కొత్త లేదా అనుమానాస్పద ఖాతాలకు భారీ మొత్తాలు పంపినప్పుడు అదనపు ధృవీకరణ కోరే అవకాశం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక భద్రతా నిబంధనలు కూడా ప్రతిపాదించారు. 70 ఏళ్లు పైబడిన వారు రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే “నమ్మకమైన వ్యక్తి” ద్వారా ధృవీకరణ అవసరం కావచ్చు.

వినియోగదారుల భద్రత కోసం “కిల్ స్విచ్”(kill switch) అనే కొత్త సౌకర్యాన్ని కూడా ప్రతిపాదించారు. దీని ద్వారా అనుమానాస్పద పరిస్థితుల్లో అన్ని డిజిటల్ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.

డిజిటల్ మోసాలు 2021–2025 మధ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి. అయితే సాధారణ చెల్లింపులు, ఈఎంఐలు, సబ్‌స్క్రిప్షన్లు, వ్యాపార లావాదేవీలకు ఈ నియమాలు వర్తించవని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఈ ప్రతిపాదనలపై మే 8 వరకు ప్రజల అభిప్రాయాలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత తుది మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

David Warner

David Warner | మత్తులో డ్రైవింగ్ చేసిన వార్నర్.. కోర్టు తీర్పుపై అందరి చూపు!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) డ్రంకెన్& డ్రైవింగ్ కేసులో చిక్కుకోవడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈస్టర్ సండే సందర్భంగా మద్యం సేవించి కారు నడిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన,...
- Advertisement -
Chat on WhatsApp