Tuesday, July 21, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTRanveer Singh | రణవీర్ సింగ్‌కు బిగ్ రిలీఫ్.. ఆంక్షలు రద్దు

Ranveer Singh | రణవీర్ సింగ్‌కు బిగ్ రిలీఫ్.. ఆంక్షలు రద్దు

-

Chat on WhatsApp

Ranveer Singh: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌పై నెలకొన్న వివాదం చివరకు ముగిసింది. ఆయనకు సంబంధించిన నాన్-కోఆపరేషన్ ఆంక్షలను FWICE ఉపసంహరించిందని అధికారికంగా తెలిపింది. దీంతో రణవీర్‌కు పెద్ద ఉపశమనం లభించింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ తప్పుకోవడంతో ఈ వివాదం మొదలైంది. సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవడం, షూటింగ్ ఆలస్యాలు వంటి కారణాలతో ఆయన ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.

అయితే ఈ పరిణామం తర్వాత నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ రణవీర్‌పై భారీగా రూ.45 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఇదే సమయంలో FWICE ఆయనపై నాన్-కోఆపరేషన్ నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ అంశంలో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPAA), ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అలాగే సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహించాయి. వారి చర్చల ఫలితంగా సమస్య పరిష్కారమైంది.

FWICE అధ్యక్షుడు బి.ఎన్. తివారీ మాట్లాడుతూ సినీ సంఘాల అభ్యర్థన మేరకు రణవీర్‌పై ఉన్న ఆదేశాలను రద్దు చేస్తున్నామని తెలిపారు. నిర్మాతలు, దర్శకులు, నటుల మధ్య సౌహార్ద వాతావరణం కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదంలో ఎవరు గెలవలేదు, ఎవరు ఓడిపోలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక రణవీర్ సింగ్ తరఫు లీగల్ టీమ్, తమ క్లయింట్ ఎప్పుడూ ప్రొఫెషనల్ విషయాలను గౌరవంగా పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారని తెలిపింది. దీంతో బాలీవుడ్‌లో నెలకొన్న ఈ వివాదం తాత్కాలికంగా ముగిసినట్లయింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Balakrishna suffers a minor injury during NBK111 action sequence shoot in Kakinada.

NBK111 షూటింగ్‌లో గాయపడ్డ నటసింహం.. అభిమానులకు కీలక సమాచారం

నటసింహం నందమూరి బాలకృష్ణకు NBK111 షూటింగ్‌ సమయంలో స్వల్ప గాయం అయినట్లు సమాచారం. కాకినాడ షూటింగ్‌ లొకేషన్‌లో యాక్షన్‌ ఎపిసోడ్‌ తెరకెక్కిస్తుండగా బాలయ్యకు స్వల్ప అసౌకర్యం ఏర్పడిందని, వైద్య పరీక్షల్లో మసిల్‌ టియర్‌గా...
- Advertisement -
Chat on WhatsApp