Saturday, February 28, 2026
No menu items!
Google search engine
HomeENTERTAINMENTPrabhas Spirit Villain Look | స్పిరిట్‌లో విలన్‌ లుక్ రివీల్

Prabhas Spirit Villain Look | స్పిరిట్‌లో విలన్‌ లుక్ రివీల్

- Advertisement -
Google search engine

Prabhas Spirit Villain Look: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘Spirit’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా విలన్‌గా నటిస్తున్న వివేక్‌ ఒబెరాయ్‌ (Vivek Oberoi) లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఇంటెన్స్ స్టైల్, రగ్డ్ అపియరెన్స్‌తో వివేక్‌ కొత్త అవతారంలో కనిపిస్తూ ఆసక్తిని పెంచుతున్నారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

‘స్పిరిట్’లో ప్రభాస్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించనున్నారు. పోలీస్ అధికారిగా ఆయన నటిస్తుండగా, కథ మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో సాగేలా రూపుదిద్దుకుంటోంది. యాక్షన్, ఎమోషన్, పవర్‌ఫుల్ డ్రామాతో సినిమా సాగుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథానాయికగా త్రిప్తి దిమ్రీ నటిస్తుండగా, సీనియర్ నటి కాంచన కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తొమ్మిది భాషల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం.టి – సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌ బ్యానర్లపై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుని రూపొందుతోంది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular