Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalఫిలడెల్ఫియాలో విమాన ప్రమాదం, 6 మంది మృతి

ఫిలడెల్ఫియాలో విమాన ప్రమాదం, 6 మంది మృతి

-

Chat on WhatsApp

అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మరొక విమాన ప్రమాదం సంభవించింది. ఫిలడెల్ఫియా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసిన కొన్ని సెకన్లలోనే విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. విమానం ఒక షాపింగ్ మాల్ సమీపంలో కూలిపోయింది, దీంతో కొన్ని భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

ఈ విమానం ఈశాన్య ఫిలడెల్ఫియాకు చెందిన విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అయితే టేకాఫ్ చేసిన 30 సెకన్లలోనే విమానం ప్రమాదానికి గురైంది. విమానం భవనంపై పడడంతో చెలరేగిన మంటల్లో అనేక భవనాలు కమ్మబడ్డాయి. ఈ ప్రమాదంలో కొంతమంది గాయపడ్డారు.

ఫిలడెల్ఫియా ఆఫీస్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ ప్రారంభించామని పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో ప్రకటించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరా ద్వారా ఈ సంఘటన మొత్తం రికార్డ్ అయింది. విమానం భవనంపై పడిన తర్వాత అది క్షణాల్లో మంటల బంతిగా మారిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp