పవన్ కళ్యాణ్ పర్యటనలో అనుమానాస్పద వ్యక్తి

Security concerns during Pawan Kalyan’s Rajolu tour as unknown man approaches Deputy CM Security concerns during Pawan Kalyan’s Rajolu tour as unknown man approaches Deputy CM

Pawan Kalyan Rajolu tour security: రాజోలు నియోజకవర్గంలో 26వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా అనుమానాస్పద పరిస్థితి చోటుచేసుకుంది. పర్యటన మొత్తం వ్యవధిలో ఒక అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి అసాధారణంగా సమీపంలో సంచరించినట్లు సమాచారం.

శంకరగుప్తం ప్రాంతంలో డ్రెయిన్ సమస్యల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న సమయంలోనూ, తరువాత అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలోనూ అతను ఉప ముఖ్యమంత్రికి దగ్గరగా కనిపించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ALSO READ:White House incident: అమెరికాలో నేషనల్ గార్డ్‌పై దాడి..అదనపు బలగాల దింపిన ట్రంప్ 

సదరు వ్యక్తి రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త అని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందింది. అతని ప్రవర్తన, కదలికలు, కార్యక్రమంలో చొరబడిన విధానం భద్రతా వ్యవస్థలో అనుమానాలు రేకెత్తించాయి.

ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీకి విషయాన్ని నివేదించింది.

కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతని వద్ద ఎలా చేరింది? అతను పర్యటనలోని పలు కీలక ప్రాంతాల్లో ఎందుకు, ఎలా కనిపించాడని ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.

ఈ అనుమానాలన్నిటినీ జిల్లా ఎస్పీకి వివరిస్తూ తగిన విచారణ చేపట్టాల్సిందిగా అభ్యర్థించారు. భద్రతా చర్యల్లో ఏదైనా లోపం ఉందో లేదో పరిశీలించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *