తిరువీర్ హీరోగా వచ్చిన పాపం ప్రతాప్ మూవీ ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్నమైన కథలతో గుర్తింపు పొందిన తిరువీర్ మరోసారి సున్నితమైన లవ్-ఎమోషనల్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ ఏమిటి అంటే ?
ప్రతాప్ (Thiruveer) చిన్ననాటి నుంచి ప్రేమించిన బుజ్జమ్మ (Payal Radhakrishna)ను పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లైన మూడు రోజులకే బుజ్జమ్మ అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు సమస్య ఏమిటో చెప్పకపోవడంతో ప్రతాప్ అయోమయంలో పడతాడు. తన వల్ల ఏం తప్పు జరిగిందో తెలుసుకోవడానికి అతడు చేసే ప్రయత్నాలే సినిమా ప్రధాన కథ.
సినిమా ఎలా ఉందంటే ?
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ సినిమా మొదటి భాగంలో కామెడీ, లైట్ ఎమోషన్స్‌తో ఎంటర్‌టైన్ చేస్తుంది. పెళ్లి తర్వాత జరిగిన పరిణామాలు, పంచాయితీ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఫస్టాఫ్ ఫన్నీగా సాగితే, సెకండాఫ్‌లో ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల కథ కాస్త స్లోగా అనిపిస్తుంది.
నటన ఎలా ఉంది?
తిరువీర్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకమైన యువకుడి పాత్రలో మెచ్యూరిటీ చూపించాడు. హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ కూడా మంచి నటన కనబర్చింది. అజయ్ ఘోష్ పాత్ర కథకు బలాన్నిస్తుంది. రాశి, ప్రసాద్ బెహరా, రఘుబాబు వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ అంశాలు ఇలా ఉన్నాయ్
డైరెక్టర్ ఎస్పీ దుర్గా నరేష్ కథను బాగా తెరకెక్కించినప్పటికీ, స్క్రీన్‌ప్లేలో ఇంకాస్త పట్టు ఉంటే సినిమా మరింత మెరుగ్గా ఉండేది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ సాధారణంగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్‌లో కాస్త కుదిస్తే బాగుండేది అనే భావన కలిగింది.
ఫైనల్ రిసల్ట్ ఇలా ఉంది
పాపం ప్రతాప్ చిన్న కథతో, భావోద్వేగాలపై ఆధారపడి తీసిన సింపుల్ ఎంటర్‌టైనర్. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్ చేస్తే, సెకండాఫ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.మొత్తానికి సినిమా చాలా బాగుంది అని నెటిజన్స్ పేర్కొంటున్నారు.








