Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeNationalBhubaneswar Railway Incident | ఒడిశాలో తృటిలో తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై రెండు...

Bhubaneswar Railway Incident | ఒడిశాలో తృటిలో తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు!

-

Chat on WhatsApp

Bhubaneswar Railway Incident: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గురువారం ఒక భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. జార్పాడా వంతెన వద్ద ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా రావడంతో క్షణాల్లో పరిస్థితి భయానకంగా మారిపోయింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, సిగ్నలింగ్ లోపం లేదా మానవ తప్పిదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే లోకో పైలట్లు మరియు రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకే లైన్‌పై వేగంగా వస్తున్న రెండు రైళ్లను గమనించిన వెంటనే వారు అత్యవసరంగా బ్రేక్‌లు వేయడంతో రెండు రైళ్లు కొద్ది దూరంలోనే నిలిచిపోయాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ రెండు రైళ్లు కూడా ఖాళీ బోగీలతో ఉన్న ‘ఎంప్టీ రేక్స్’ కావడంతో ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ ప్రయాణికులతో నడిచే రైళ్లు అయి ఉంటే భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమీప ప్రాంత ప్రజలు రెండు రైళ్లు ఎదురెదురుగా నిలిచిన దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. రైల్వే వ్యవస్థపై నిర్వహణ లోపాలపై వారు ప్రశ్నలు లేవనెత్తారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తూర్పు తీర రైల్వే అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమా లేదా కమ్యూనికేషన్ తప్పిదమా అనే కోణంలో పరిశీలన జరుగుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఏదేమైనా పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp