New Aadhaar Card Update: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిస్థాయిలో పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ కొత్త ఆధార్ కార్డులో కేవలం ఫోటో మరియు ఎన్‌క్రిప్టెడ్ QR కోడ్ మాత్రమే ఉండనున్నాయి.
ఇప్పటివరకు కార్డ్‌పై ముద్రించబడే పేరు, ఆధార్ నంబర్, చిరునామా, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను పూర్తిగా తొలగించాలనే నిర్ణయాన్ని UIDAI తీసుకుంది.
కొత్త రూపకల్పనలో కీలకమైన అంశం QR కోడ్ ఆధారిత ధృవీకరణ. అవసరమైన సమాచారాన్ని ఇకపై ఈ ఎన్‌క్రిప్టెడ్ QR కోడ్ ద్వారానే అధికారిక పద్ధతుల్లో స్కాన్ చేసి తెలుసుకోవాలి. ఇది సాధారణ స్కానర్ల ద్వారా అందుబాటులో ఉండదు; భద్రతా ప్రమాణాలు ఉన్న అధికారిక వెరిఫికేషన్ సిస్టమ్స్ ద్వారానే వివరాలు కనిపిస్తాయి.
ALSO READ:TTD Donation: టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
UIDAI ప్రకారం, హోటళ్ళు, కార్యాలయాలు, సేవా కేంద్రాలు మరియు ఈవెంట్‌లలో ఆధార్ కార్డు ఫోటోకాపీలు తీసుకుని నిల్వ చేసే పరిస్థితులు పెరగడం గోప్యతకు ప్రమాదకరమని భావించారు.
ఈ కొత్త డిజైన్ ద్వారా వ్యక్తిగత సమాచారం ముద్రింపును పూర్తిగా తొలగించడం వల్ల డాటా దుర్వినియోగం అవకాశాలు తగ్గుతాయని తెలిపారు. గోప్యత, భద్రత మరియు డేటా రక్షణను మెరుగుపరచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.
