మీరట్‌లో భర్తను హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో దాచిన కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితురాలు ముస్కాన్ రస్తోగి జైలులో గర్భవతిగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ధృవీకరించగా, అధికారికంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అశోక్ కటారియా వివరాలు వెల్లడించారు.
ముస్కాన్ భర్త సౌరభ్ రాజ్‌పుత్ లండన్‌లో ఉన్న సమయంలో ఆమె గర్భం దాల్చిన విషయం సంచలనంగా మారింది. మర్చంట్ నేవీలో పనిచేసిన సౌరభ్, భార్యను చూసుకోవాలని ఉద్యోగం వదిలేశాడు. కానీ ఆమె మాత్రం ప్రియుడు సాహిల్‌తో కలిసి సౌరభ్‌ను పొడిచి చంపి, మృతదేహాన్ని సిమెంట్ డ్రమ్ములో దాచారు.
వారు 2016లో పెళ్లి చేసుకుని ఐదేళ్ల కుమార్తెకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే పాప పుట్టిన తర్వాత ముస్కాన్‌కి సాహిల్‌తో పరిచయం ఏర్పడగా, అది వివాహేతర సంబంధంగా మారింది. భర్త ఉన్నా, ప్రియుడితో కలిసి తిరుగుతూ పథకం వేసి ఈ హత్యను అమలు చేశారు.
కూతురు బర్త్‌డే కోసం లండన్ నుంచి వచ్చిన సౌరభ్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అతడి శవాన్ని డ్రమ్ములో ఉంచి సీల్ చేసి, నిర్లక్ష్యంగా ప్రియుడితో విహారయాత్రకు వెళ్లారు. ఇప్పుడు జైలులో ముస్కాన్ గర్భవతిగా తేలడమే కాక, ఆ శిశువు తండ్రెవరో అనే అంశం చర్చనీయాంశంగా మారింది.