చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో విషాదం నెలకొంది. జట్టు యువ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి మంగళవారం ముంబైలోని టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత ఏడాది కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే సీఎస్కే యాజమాన్యం, ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ముకేశ్ చౌదరి వెంటనే తన స్వస్థలమైన రాజస్థాన్‌లోని భిల్వారాకు బయలుదేరి వెళ్లారు. అక్కడ తన అన్న డాక్టర్ రాజేశ్ చౌదరితో కలిసి తల్లి అంత్యక్రియలను పూర్తి చేశారు.
ఈ కష్ట సమయంలో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముకేశ్‌కు అండగా నిలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ధోనీ నిరంతరం ఫోన్లో మాట్లాడుతూ ముకేశ్‌కు ధైర్యం చెప్పినట్లు సమాచారం.
అంతేకాకుండా ఆసుపత్రికి వెళ్లి ఆయన తల్లిని పరామర్శించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో ధోనీ గొప్ప మనసుకు మరో ఉదాహరణగా నిలిచింది.
అంత్యక్రియల అనంతరం ముకేశ్ చౌదరి తిరిగి జట్టు శిబిరంలో చేరినట్లు సమాచారం. అయితే, వ్యక్తిగత విషాదం కారణంగా ఆయన కొద్దిరోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. అనంతరం పంజాబ్ కింగ్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని జట్టు వర్గాలు తెలిపాయి.
ఈ సీజన్లో ముకేశ్ ఇప్పటివరకు ఒకే మ్యాచ్ ఆడారు. అయినప్పటికీ, ఈ విషాద ఘటన అతని క్రికెట్ ప్రయాణంలో భావోద్వేగ ఘట్టంగా నిలిచింది.








