HomeTechnology NewsGoogle Chrome | క్రోమ్‌లో స్మార్ట్ AI ఫీచర్.. పనులను స్వయంగా పూర్తి చేసే గూగుల్...

Google Chrome | క్రోమ్‌లో స్మార్ట్ AI ఫీచర్.. పనులను స్వయంగా పూర్తి చేసే గూగుల్ టెక్నాలజీ

-

Chat on WhatsApp

Google Chrome: గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌లో సంస్థల కోసం భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అప్‌డేట్‌ను ప్రకటించింది. “ఆటో బ్రౌజ్” అనే కొత్త AI ఫీచర్ ద్వారా సంస్థల్లో జరిగే రోజువారీ పనులను మరింత వేగంగా, ఆటోమేటిక్‌గా పూర్తి చేసే అవకాశం కల్పించనుంది.

ఈ కొత్త ఫీచర్‌లో గూగుల్ జెమినీ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఓపెన్ చేసిన ట్యాబ్‌ల కాంటెక్స్ట్‌ను అర్థం చేసుకుని ట్రావెల్ బుకింగ్స్, మీటింగ్ షెడ్యూలింగ్, ఫారమ్ ఫిల్లింగ్ వంటి పనులను స్వయంగా పూర్తి చేయగలదు.

అలాగే CRM సిస్టమ్‌లలో డేటా ఎంట్రీ, ట్యాబ్‌ల మధ్య ధరల పోలిక, ఇంటర్వ్యూలకు ముందు అభ్యర్థుల సమాచారం సమ్మరీ చేయడం వంటి పనులు కూడా సులభమవుతాయి.

గూగుల్ ఈ AI ఫీచర్ ప్రధాన లక్ష్యం ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించి వేగాన్ని పెంచడమే అని తెలిపింది. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం AI వాడకం వల్ల పనిభారం తగ్గకుండా పెరగవచ్చని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ టెక్నాలజీ సంస్థల్లో ఎలా ఉపయోగపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ముందుగా ఈ ఫీచర్ అమెరికాలోని Google Workspace యూజర్లకు అందుబాటులోకి రానుంది. యూజర్లు తమ తరచూ చేసే పనులను “స్కిల్స్”గా సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సంస్థల డేటాను AI ట్రైనింగ్ కోసం ఉపయోగించమని గూగుల్ హామీ ఇచ్చింది.

భద్రతా పరంగా కూడా గూగుల్ కీలక మార్పులు చేసింది. క్రోమ్ ఇంటర్ప్రైస్ ప్రీమియం (Chrome Enterprise Premium) ద్వారా అనధికార AI టూల్స్‌ను గుర్తించే వ్యవస్థను అప్‌డేట్ చేసింది. IT టీమ్‌లు అనుమానాస్పద బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్, అనధికార AI సేవలను గుర్తించగలుగుతాయి.

అదనంగా “షాడో IT రిస్క్ డిటెక్షన్” ఫీచర్ ద్వారా సంస్థలో వాడుతున్న అన్ని AI మరియు SaaS సైట్లపై పూర్తి నియంత్రణ పొందవచ్చు. ముఖ్యమైన మార్పులు, పాలసీలు, అప్‌డేట్స్‌ను AI ఆధారంగా సమ్మరీ రూపంలో అందించేలా కొత్త సిస్టమ్‌ను కూడా గూగుల్ తీసుకొస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp