Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsMotorola Moto G Max 5G వచ్చేసింది… ధర, ఫీచర్లు ఇవే

Motorola Moto G Max 5G వచ్చేసింది… ధర, ఫీచర్లు ఇవే

-

Chat on WhatsApp

Motorola Moto G Max 5G: మోటరోలా సంస్థ తన నూతన Moto G Max 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఫోటోగ్రఫీ, డిస్‌ప్లే, పనితీరు పరంగా హైఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించడంతో టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 200MP ప్రైమరీ కెమెరా అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండటంతో ఫోటోలు, వీడియోలు మరింత స్థిరంగా, క్లారిటీగా రికార్డ్ చేయవచ్చు. అదనంగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ద్వారా 120 డిగ్రీల విస్తృత దృశ్యాలను క్యాప్చర్ చేయవచ్చు.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇవ్వడం జరిగింది. 2K రిజల్యూషన్‌లో 30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది. డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.8 అంగుళాల AMOLED స్క్రీన్‌ను అందించారు. 1272 x 2772 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ మరియు గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. గరిష్టంగా 5000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా గొరిల్లా గ్లాస్ 7i రక్షణను కూడా కల్పించారు.

పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డిమెంసిటీ 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hello UIపై ఇది పనిచేస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. బ్యాటరీ విభాగంలో 5,200mAh సామర్థ్యం గల బ్యాటరీని అందించగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. USB Type-C ద్వారా త్వరగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

దృఢత్వం విషయంలో కూడా మోటరోలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. IP66, IP68, IP69 రేటింగ్‌లతో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉండటం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ ఫోన్ బ్రెజిల్ మార్కెట్లో సుమారు రూ.47,000 ధరకు లాంచ్ అయింది. భారత మార్కెట్లో విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp