Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeUncategorizedMind control patent | మైండ్ కంట్రోల్ టెక్నాలజీ నిజమా? వైరల్ పేటెంట్ వెనుక వాస్తవం

Mind control patent | మైండ్ కంట్రోల్ టెక్నాలజీ నిజమా? వైరల్ పేటెంట్ వెనుక వాస్తవం

-

Chat on WhatsApp

Mind control patent: టీవీ, కంప్యూటర్ స్క్రీన్‌ల ద్వారా మనిషి మెదడును ప్రభావితం చేయవచ్చన్న పాత అమెరికా పేటెంట్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2001లో దాఖలైన “Nervous System Manipulation by Electromagnetic Fields from Monitors” పేరుతో ఉన్న ఈ పేటెంట్‌ను బ్రిటన్‌కు చెందిన డైలీ మెయిల్ (Daily Mail) ప్రస్తావించడంతో చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

స్క్రీన్‌ల నుంచి వెలువడే ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలు శరీరంలోని నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపవచ్చని ఇందులో పేర్కొన్నారు.

ఈ పేటెంట్‌ను రూపొందించిన Hendricus G. Loos ఒకప్పుడు నాసా లో పనిచేశారని సమాచారం. పాత తరహా సిఆర్టీ(CRT) మానిటర్ల నుంచి వచ్చే తక్కువ ఫ్రీక్వెన్సీ (0.1 నుంచి 15 హెర్ట్జ్) పల్స్ తరంగాలు హృదయ స్పందన, జీర్ణక్రియ వంటి ఆటోనామిక్ వ్యవస్థలపై ప్రభావం చూపవచ్చని ఆయన సిద్ధాంతం.

అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఎక్కువగా పాత మానిటర్లకే పరిమితమై ఉండొచ్చు. ఆధునిక ఎల్ఈడీ(LED) స్క్రీన్‌లు చాలా తక్కువ ఎలెక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ విడుదల చేస్తాయని, అందువల్ల ప్రస్తుతం ‘బ్రెయిన్‌వాష్’ ఆరోపణలు శాస్త్రీయంగా బలహీనమని పరిశోధకులు చెబుతున్నారు. 2021లో పేటెంట్ గడువు ముగియడంతో చర్చలు మళ్లీ వేడెక్కాయి.

ALSO READ:Jubilee Hills Fire accident |జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp