14 మార్చి 2025, శుక్రవారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం నుంచి జనసేన పార్టీ జయకేతనం సభకు భారీ ర్యాలీ బయలుదేరింది. వీరఘట్టం జనసేన కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ యువతను రాజకీయంగా ముందుండి నడిపిస్తున్నారని, 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారిగా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో పాల్గొనడం జనసైనికులకు ఉత్సాహాన్నిచ్చింది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో వాహనాలు, బైకులు, నినాదాలతో జనసేన కార్యకర్తలు ముందుకు సాగారు.
ఈ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక వాలంటీర్ మత్స. పుండరీకం, ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ పొట్నూర్ రమేష్, జనసేన నాయకులు రౌతు గోవిందా నాయుడు, దత్తి గోపాలకృష్ణ, సరపల్లి అచ్యుత్, నందివాడా పండు, సిరాపు నాగరాజు, పుప్పాల పురుషోత్తం, రౌతు నవీన్, జామి అనిల్, మెడిద సందీప్, దండేలా సతీష్, సొండి సుమన్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని కార్యకర్తలు కృతనిశ్చయంతో ఉన్నారు. పార్టీకి మద్దతుగా వేలాది మంది జనసైనికులు తరలివస్తుండగా, పాలకొండ నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు జనసేన జయకేతనం సభకు తరలివెళ్లడం విశేషం.