భారతదేశానికి గర్వకారణమైన మహిళా బాక్సింగ్ లెజెండ్ మేరీకోమ్ వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆమె తన భర్త ఓన్లర్ కరుంగ్‌తో 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నారని సమాచారం. వీరి మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో విడాకుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుందట.
2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓన్లర్ రాజకీయాల్లో ప్రవేశించి ఓడిపోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని చెబుతున్నారు. ఆర్థిక నష్టాలు, అభిప్రాయ భేదాలు వీరి మధ్య దూరాన్ని పెంచినట్టు సమాచారం. అప్పటి నుంచి ఈ దంపతులు వేర్వేరుగా ఉంటున్నారన్న వార్తలు అప్పుడే చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం మేరీకోమ్ తన నలుగురు పిల్లలతో కలిసి ఫరీదాబాద్‌లో ఉంటుండగా, ఓన్లర్ ఢిల్లీలో కుటుంబసభ్యులతో ఉన్నారు. ఈ వేరువేరుగా నివాసం కూడా వీరి మధ్య దూరాన్ని బలంగా చూపిస్తోంది. అభిమానుల ఆశలన్నింటినీ మింగేసే విధంగా ఇప్పుడు విడాకుల ప్రక్రియ వార్తల్లో నిలుస్తోంది.
ఇక మరోవైపు, మేరీకోమ్ తన బిజినెస్ పార్టనర్ హితేశ్ చౌదరీతో రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. హితేశ్, మేరీకోమ్ ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు షేర్ చేస్తూ హితేశ్ చేయుతోన్న హావభావాలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.