టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన తాజా సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. “ఏజెంట్” చిత్రం తర్వాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న అఖిల్, చివరికి తన 6వ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
కొత్త దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రేపు (మంగళవారం) విడుదల చేయనున్నట్లు టీమ్ వెల్లడించింది. “ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు” అనే క్యాప్షన్‌తో ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఈ సినిమాలో అఖిల్‌కు జోడిగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌గా shaping అవుతోంది.
అఖిల్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రిలీజ్ చేయనున్నారు. ‘లెనిన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా, అధికారికంగా రేపే ధృవీకరణ కానుంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రం పై ఇప్పటికే హైప్ మొదలైంది.