Monday, February 23, 2026
No menu items!
spot_img
HomeInterNationalకమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్‌గా చేయాలని డిమాండ్ చేసిన నేత

కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్‌గా చేయాలని డిమాండ్ చేసిన నేత

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డెమోక్రాట్ నేత కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్ గా చేయాలని ఒక అమెరికన్ నేత తాజాగా డిమాండ్ చేశారు. టీవీ ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్స్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జమాల్ సిమన్స్ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం, నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి జనవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సమయంలో అధికార మార్పిడి ప్రాసెస్ జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంలో, ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ రాజీనామా చేస్తే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని సిమన్స్ పేర్కొన్నారు. ఇది రాబోయే కాలంలో మహిళలు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పాలనా బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్న బైడెన్ తన చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని సిమన్స్ సూచించారు.

అయితే, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ 226 ఎలక్టోరల్ ఓట్లను పొందారు, కానీ స్వింగ్ స్టేట్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 312 ఎలక్టోరల్ ఓట్లతో విజయం సాధించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular