Donald Trump Aliens: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గ్రహాంతర వాసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వద్ద ఉన్న ఏలియన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు వెల్లడిస్తామని ప్రకటించారు. ఏలియన్స్‌పై ఉన్న ఫైళ్లను గుర్తించి విడుదల చేయాలని సంబంధిత సమాఖ్య సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.
కొన్ని దశాబ్దాలుగా అమెరికా ప్రజలు ప్రభుత్వ వద్ద ఏలియన్స్(Aliens) సమాచారంపై ఆసక్తి చూపుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే పారదర్శకత కోసం ఈ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే ఇటీవల బరాక్ ఒబామా (Barack Obama) ఒక పాడ్‌కాస్ట్‌లో గ్రహాంతర వాసులపై చేసిన వ్యాఖ్యలను ట్రంప్ విమర్శించారు. ఒబామా ఒక రహస్య విషయాన్ని ప్రస్తావించారని, అయితే దానిపై తాను ఇప్పుడే వివరాలు చెప్పలేనని అన్నారు.
ఇదిలా ఉండగా ఒబామా తన వ్యాఖ్యల్లో, ఏదో గ్రహంపై జీవం ఉండే అవకాశాన్ని నమ్ముతున్నానని చెప్పారు. అయితే నెవాడాలోని ఏరియా 51 (Area 51) వద్ద ఏలియన్స్‌ను నిర్బంధించారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఏలియన్స్ ఉనికిపై నిర్ధారిత సమాచారం తమ వద్ద లేదని వెల్లడించారు. ఏరియా 51లో భూగర్భ రహస్య కేంద్రాలున్నాయనే వాదనలను కూడా ఖండించారు.
ALSO READ:Iran Us Conflict | అణు ఒప్పందం విఫలం అయితే యుద్ధమేనా? ఇరాన్‌పై అమెరికా కఠిన హెచ్చరిక








