Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTKathanar | బాహుబలి తర్వాత మరో పవర్‌ఫుల్ రోల్‌లో అనుష్క...‘కథనార్’ కంబ్యాక్ అవుతుందా?

Kathanar | బాహుబలి తర్వాత మరో పవర్‌ఫుల్ రోల్‌లో అనుష్క…‘కథనార్’ కంబ్యాక్ అవుతుందా?

-

Chat on WhatsApp

Kathanar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మరోసారి పీరియాడిక్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “కథనార్” ట్రైలర్ తాజాగా విడుదలై మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘బాహుబలి’ తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ముందుకు సాగుతున్న అనుష్క, ఇటీవల వచ్చిన చిత్రాలతో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా, ఈ సినిమాతో బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో కనిపిస్తోంది.

శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో జయసూర్య, ప్రభుదేవ, వినీత్, శాండీ మాస్టర్, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్‌లో కనిపించిన విజువల్స్, పీరియాడిక్ సెట్టింగ్స్, మిస్టరీ టోన్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ప్రత్యేకంగా ఫాంటసీ, హారర్, థ్రిల్లర్ అంశాలను మేళవించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనుష్క పాత్రలో గంభీరత, స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి హైలైట్‌గా నిలిచాయి.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా అనుష్క కెరీర్‌కు మళ్లీ ఊపు తీసుకువస్తుందా అన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో పెరిగింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp