Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTతారక్ ఇంటి కొత్త అతిథులు.. అభిమానులతో పంచుకున్న స్పెషల్ మూమెంట్

తారక్ ఇంటి కొత్త అతిథులు.. అభిమానులతో పంచుకున్న స్పెషల్ మూమెంట్

-

Chat on WhatsApp

Jr NTR Pet Birds: జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ప్రత్యేకమైన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తన ఇంటికి కొత్తగా వచ్చిన రెండు అందమైన పక్షులను సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కు పరిచయం చేశారు.

ఆ పక్షులకు ఆయన ‘అసాహి’, ‘యూహీ’ అనే పేర్లు పెట్టినట్లు వెల్లడించారు. జపాన్ దేశంపై తనకు ఉన్న ప్రత్యేక అభిమానానికి గుర్తుగా ఈ పేర్లను ఎంపిక చేసినట్లు తారక్ తెలిపారు.

కొన్ని నెలల క్రితం ‘దేవర Part–1’ ప్రొమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో అక్కడి అభిమానులు చూపిన అపారమైన ప్రేమ, ఆదరణ తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన గతంలో తెలిపారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసిన తర్వాత ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకున్నాడనే విషయం తనను భావోద్వేగానికి గురి చేసిందని ఎన్టీఆర్ వెల్లడించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే భారీ అంచనాలను పెంచాయి.

ప్రపంచ స్థాయి మత్తు పదార్థాల వ్యాపార యుద్ధం నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్టీఆర్ ఒక కీలక హంతకుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్రపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp