Jagan CBI Court :రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్    

YS Jagan arriving for CBI court hearing in Hyderabad YS Jagan arriving for CBI court hearing in Hyderabad

రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్. అక్రమాస్తుల కేసు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి Y.S జగన్ రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఉదయం 11.30 గంటలకు ఆయన రావచ్చని సమాచారం.

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించడంతో, కోర్టు ఈ నెల 21వ తేదీ లోగా వ్యక్తిగతంగా తమ ముందుకు రావాలని ఆదేశించింది.

also read:Sathya Sai Golden Idol | 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం


ఈ నేపథ్యంలో జగన్ ఒక రోజు ముందుగానే కోర్టుకు హాజరు కావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో విచారణ పురోగతిపై కోర్టు కీలక సూచనలు చేసే అవకాశం ఉన్నందున ఈ హాజరు ప్రాధాన్యతను సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *