Friday, July 24, 2026
Chat on WhatsApp
HomeInterNationalIran-Trump | యురేనియం నిల్వలపై ‘గాలి మేడలు కట్టొద్దు’... ట్రంప్‌పై ఇరాన్ ఘాటు వ్యాక్యలు

Iran-Trump | యురేనియం నిల్వలపై ‘గాలి మేడలు కట్టొద్దు’… ట్రంప్‌పై ఇరాన్ ఘాటు వ్యాక్యలు

-

Chat on WhatsApp

Iran-Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన యురేనియం వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ తన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేందుకు సిద్ధమైందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ మీడియా కొట్టిపారేసింది.

ప్రభుత్వ ప్రసార సంస్థ IRIB సోషల్ మీడియాలో ట్రంప్ వ్యాఖ్యల వీడియోను పంచుకుంటూ పర్షియన్ భాషలో సెటైర్లు వేసింది.

“గాలి మేడలు కట్టొద్దు” (Building castles in the air) అంటూ ట్రంప్ వ్యాఖ్యలను ఎగతాళి చేస్తూ, వాస్తవానికి దూరంగా కలల్లో జీవిస్తున్నారనే అర్థంతో సామెతను ఉపయోగించింది. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

ట్రంప్ ఏమన్నారు?

వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ తమ యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించేందుకు అంగీకరించిందని ప్రకటించారు. రెండు దేశాల మధ్య అణు ఒప్పందం త్వరలో కుదిరే అవకాశముందని ఆయన తెలిపారు. ఒప్పందం కుదిరితే ప్రపంచానికి ప్రయోజనం ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు.

చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?

ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లో అమెరికా, ఇరాన్ మధ్య ప్రధాన విభేదం యురేనియం శుద్ధి అంశంపైనే నిలిచింది. అమెరికా 20 సంవత్సరాలపాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని కోరగా, ఇరాన్ మాత్రం ఐదు సంవత్సరాలకు మాత్రమే అంగీకరించింది. ఈ కారణంగా చర్చలు ఫలించలేదు.

మధ్యవర్తిత్వం కోసం పాకిస్థాన్ ప్రయత్నాలు

పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ (Asim Munir) ఇరాన్‌లో పర్యటిస్తూ కీలక నేతలతో సమావేశమవుతున్నారు. టెహ్రాన్‌లో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మరియు ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు రెండో విడత ఒప్పందానికి దారి తీసే అవకాశముందనే అంచనాలు ఉన్నాయి.

ఇరాన్ స్పష్టం

ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని మరోసారి వెల్లడించింది. అణు ఆయుధాల తయారీపై తమకు ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu

Amaravati | చంద్రబాబు విజన్‌కు మరో రూపం.. అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ సెంటర్

Amaravati: అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి క్వాంటం వ్యాలీలో "క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్" ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ నేషనల్...
- Advertisement -
Chat on WhatsApp