Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeInterNationalIran Oil Tanker | ఇరాన్ నుంచి భారత్ చమురు.. ట్యాంకర్ రూట్ మార్పు కారణాలను...

Iran Oil Tanker | ఇరాన్ నుంచి భారత్ చమురు.. ట్యాంకర్ రూట్ మార్పు కారణాలను వెల్లడించిన మంత్రిత్వ శాఖ

-

Chat on WhatsApp

Iran Oil Tanker: ఇరాన్ నుంచి భారత్‌కు చమురు తీసుకువస్తున్న ట్యాంకర్ ‘పింగ్ షున్’ మధ్యలో చైనా వైపు వెళ్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, భారత్ పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది.

నౌక దారి మారడానికి చెల్లింపులు కారణం కాదని, ఇది నిర్వహణ, ట్రేడ్ ఆప్టిమైజేషన్ కారణంగా మాత్రమే మారతుందని వెల్లడించారు.

షిప్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘కెప్లర్’ ప్రకారం, గుజరాత్‌లోని వడినార్‌కు చేరాల్సిన ట్యాంకర్ ప్రస్తుతం చైనాలోని డోంగ్యింగ్ వైపు వెళ్తోంది. నిపుణుల ప్రకారం, AIS ట్రాన్స్‌పాండర్ చూపిస్తున్న గమ్యస్థానం ప్రయాణ సమయంలో మారవచ్చునని ఇది సాధారణం.

మార్చి 4న ఖర్గ్ ద్వీపం వద్ద ట్యాంకర్‌లో సుమారు 6,00,000 బ్యారెల్స్ చమురు లోడింగ్ అయ్యింది. గతంలో భారత్ ఇరాన్ చమురుకు ప్రధాన దిగుమతిదారుగా ఉండేది, 2018లో రోజుకు సుమారు 5,18,000 బ్యారెల్స్, 2019 మే నాటికి 2,68,000 బ్యారెల్స్కు తగ్గించుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా దిగుమతులు పూర్తిగా తగ్గాయి.

ప్రస్తుతంలో, చమురు ధరలను తగ్గించడానికి అమెరికా 30 రోజుల పాటు ఇరాన్ చమురు కొనుగోళ్లపై ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది.

2019 తర్వాత భారత్ వైపు బయలుదేరిన ట్యాంకర్ చైనా వైపు మళ్లడం వ్యాపార, ట్రేడ్ ఆప్టిమైజేషన్ కారణమని ప్రభుత్వ ప్రకటన స్పష్టం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp