Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeRangareddyLal Bahadur Nagaపల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ ప్రారంభం

పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఇన్నోవేషన్ బూట్ క్యాంప్ ప్రారంభం

-

Chat on WhatsApp

నాగోల్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూట్ క్యాంప్‌లను మొదటి రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆవిష్కరణ, రూపకల్పన, వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి హాజరై, పీఏమై నరేంద్ర మోదీ ఊహించిన విధంగా ఈ కార్యక్రమాలు విద్యార్ధుల ఆవిష్కరణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, పాఠశాలలు మరియు ఉన్నత విద్యాసంస్థల నుండి ఇన్నోవేషన్ అంబాసిడర్లను తయారుచేసే దిశగా కొనసాగిస్తున్నాయని తెలిపారు.

బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలు ప్రభుత్వ విధానాలు, సమర్థవంతమైన శిక్షణ, మరియు సహకారం ద్వారా విద్యార్థులకు వ్యాపార ఆవిష్కరణల్లో ముందంజ వేసేందుకు అవకాశాలను కల్పించాయన్నారు. విద్యార్థులకు ఆధునిక రంగాలలో సరైన దిశా నిర్దేశం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వసించారు.

కంప్యూటింగ్, ఇంజనీరింగ్, మరియు ఇతర శాస్త్రాలలో నూతన ఆవిష్కరణలకు దారితీసే ఈ బూట్ క్యాంప్ కార్యక్రమం మరింతమందికి చేరేలా పల్లవి ఇంజనీరింగ్ కళాశాల ఉత్సాహంగా నిర్వహిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp