75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రాజ్యాంగానికి చెందిన డిజిటల్ వెర్షన్లను తొమ్మిది భారతీయ భాషల్లో విడుదల చేశారు. మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా మరియు అస్సామీ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ డిజిటల్ ప్రతులు దేశవ్యాప్తంగా పౌరులకు రాజ్యాంగం చేరువ కావడానికి ఒక కీలక అడుగుగా భావించబడుతున్నాయి.
రాష్ట్రపతి మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు, విధులు మరియు మౌలిక సూత్రాలపై ప్రజలకు అవగాహన పెంపుదలకు డిజిటల్ రూపం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
రాజ్యాంగాన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రతి పౌరుడు సులభంగా చదవగలిగే అవకాశం లభిస్తుందని, ఇది ప్రజాస్వామ్య బలపర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
డిజిటల్ యాక్సెస్ పెరుగుతున్న నేపథ్యంలో రాజ్యాంగాన్ని భాషా వైవిధ్యంతో అందించడం కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఉందని అధికారులు భావిస్తున్నారు.
ALSO READ:డిసెంబర్లో కొత్త ఆధార్ కార్డు: వ్యక్తిగత వివరాల తొలగింపుతో కొత్త రూపకల్పన
