India Climate Risk Report:ప్రకృతి విపత్తులు ముప్పు..30 ఏళ్లలో 80వేల మంది మృతి!

Flooded Indian village after a severe cyclone showing the impact of natural disasters. Flooded Indian village after a severe cyclone showing the impact of natural disasters.

పకృతి పగబట్టడం(CLIMATE DISASTER) అంటే ఇదేనేమో అనిపిస్తుంది.గత మూడు దశాబ్దాల్లో భారత్‌పై ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రంగా పడిందని తాజా నివేదిక చెబుతోంది. 1995 నుంచి 2024 వరకు తుఫాన్లు, వరదలు, హీట్‌వేవ్స్ వంటి 430 ప్రధాన ప్రకృతి విపత్తులు సంభవించి, సుమారు 80వేల మంది ప్రాణాలు కోల్పోయారని ‘జర్మన్వాచ్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (CRI) వెల్లడించింది.

ఈ విపత్తుల ప్రభావంతో 130 కోట్ల మంది జీవితాలు నేరుగా లేదా పరోక్షంగా దెబ్బతిన్నాయని పేర్కొంది.

అదనంగా, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల భారత్‌కు సుమారు రూ. లక్షా 50వేల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని నివేదికలో వివరించింది. గ్లోబల్ స్థాయిలో అత్యంత ప్రభావిత దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. డొమెనికా దేశం మొదటి స్థానంలో నిలిచింది.

also read:Jubilee Hills By-election:ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు భద్రంగా తరలింపు


వాతావరణ మార్పులు వేగంగా పెరుగుతున్న తరుణంలో, వర్షపాతం అసమానతలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, సముద్ర మట్టం ఎత్తు వంటి అంశాలు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *