Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTHoney Rose | హనీ రోజ్‌కు చేదు అనుభవం.. మాల్ ఓపెనింగ్‌లో హద్దు దాటిన ఆకతాయిలు

Honey Rose | హనీ రోజ్‌కు చేదు అనుభవం.. మాల్ ఓపెనింగ్‌లో హద్దు దాటిన ఆకతాయిలు

-

Chat on WhatsApp

Honey Rose | టాలీవుడ్‌లో ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ భామ హనీ రోజ్‌కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలతో బిజీగా ఉండే ఈ నటి, ఇటీవల ఒక మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆమెను దగ్గరగా చూడటానికి, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. హనీ రోజ్ కూడా ఎంతో ఓపికగా అభిమానులతో మెలుగుతూ అందరికీ సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు.

అయితే, ఈ హడావిడిలో కొందరు ఆకతాయిలు హద్దు దాటి ప్రవర్తించడం కలకలం రేపింది. సెల్ఫీలు దిగుతున్న నెపంతో ఆమె వ్యక్తిగత పరిధిని అతిక్రమిస్తూ అసభ్యంగా ప్రవర్తించినట్లు అక్కడి వీడియోల్లో కనిపిస్తోంది.

జనం అధికంగా ఉండటం, చుట్టూ తోపులాట నెలకొనడం వల్ల హనీ రోజ్ అసౌకర్యానికి గురైనట్లు స్పష్టమైంది. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుండటంతో ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో, నెటిజన్లు మండిపడుతున్నారు. “అభిమానం పేరుతో ఇలాంటి ప్రవర్తన అస్సలు సమర్థించలేము” అని కొందరు మండిపడుతుండగా, “సెలబ్రిటీల భద్రత విషయంలో నిర్వాహకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి” అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఒక ప్రముఖ నటి పబ్లిక్ ఈవెంట్‌లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడం బాధాకరమని సినీ అభిమానులు కూడా అంటున్నారు. ఈ ఘటన మరోసారి మహిళా సెలబ్రిటీల భద్రత, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో ఉండాల్సిన జాగ్రత్తలపై చర్చకు దారితీసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp