విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, తెదేపా సీనియర్ నాయకులు వుండవిల్లి రాంబాబు సూచించారు. రాయవరం మండల కేంద్రంలోని విజ్ఞాన్, వీఎస్ఆర్ రూరల్ కళాశాలల ప్రాంగణంలో ఫేర్వెల్ డే వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అమ్మి రెడ్డి విద్యాసంస్థల అధినేతలు డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి, శేషవేణి, రాయవరం సాయి తేజ విద్యానికేతన్ చైర్మన్ కర్రి సందీప్ రెడ్డి, భాను రేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో ముందుకు సాగాలని వారు సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని విద్యార్థులకు సూచించారు.
ఫేర్వెల్ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్స్ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల అద్భుత ప్రదర్శనలు, యువతీయువకుల డీజే డాన్స్ కళాశాల విద్యార్థులకు ఆనందాన్ని కలిగించాయి.
ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాళ్లు అచ్చిరెడ్డి, మల్లిడి సతీష్ రెడ్డి, పివి, విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విజ్ఞాన్ కళాశాల ఎల్లప్పుడూ మంచి విద్యను అందించేందుకు కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.