Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeSportsGautam Gambhir | ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్‌కు కొత్త రూపం.. మూడో స్థానంలో సుదర్శన్ ఖాయం?

Gautam Gambhir | ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్‌కు కొత్త రూపం.. మూడో స్థానంలో సుదర్శన్ ఖాయం?

-

Chat on WhatsApp

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) జట్టు పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తూ కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు ముఖ్యమైన అంశాలపై స్పష్టతనిచ్చారు.

ముఖ్యంగా టెస్టుల్లో మూడో స్థానానికి యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు పూర్తి అవకాశాలు ఇవ్వనున్నట్లు గంభీర్ ప్రకటించాడు. అతడి ప్రతిభను గుర్తిస్తూ ఇప్పటివరకు సరైన అవకాశాలు రాలేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో సుదర్శన్ 700 పరుగులు సాధించాడని, అలాగే విదేశీ పర్యటనల్లోనూ స్థిరమైన ప్రదర్శన కనబరిచాడని పేర్కొన్నాడు. కేవలం కొద్ది మ్యాచ్‌ల ఆధారంగా ఆటగాళ్లను అంచనా వేయడం సరికాదని స్పష్టం చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ టెస్టులో సుదర్శన్ మూడో స్థానంలో ఆడే అవకాశం బలంగా కనిపిస్తోంది.

అదే సమయంలో రాబోయే శ్రీలంక పర్యటనపై కూడా గంభీర్ వ్యూహాన్ని వెల్లడించాడు. ఆ సిరీస్‌కు నాలుగు స్పిన్నర్లతో వెళ్లే ఆలోచన ఉందని తెలిపాడు. నాలుగో స్పిన్నర్ స్థానానికి మానవ్ సుతార్, హర్ష్ దూబే మధ్య పోటీ కొనసాగుతోందని, ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్ వారి ప్రతిభను పరీక్షించే వేదికగా ఉపయోగపడుతుందని చెప్పాడు.

ఇక రిషభ్ పంత్‌పై వైస్ కెప్టెన్సీ కోల్పోయిన నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. పంత్ తన సహజ ఆటశైలిని కొనసాగించాలనే తమ అభిమతమని, అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఆడటం అత్యంత కీలకమని సూచించాడు. జట్టులో పంత్‌కు ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని, కానీ మరింత పరిపక్వత చూపాల్సిన అవసరం ఉందని హితవు పలికాడు. గంభీర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు టీమిండియా భవిష్యత్ నిర్మాణానికి దారి చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp