Sunday, July 19, 2026
Chat on WhatsApp
HomeNationalTiruchirappalli East Bypoll | తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై ఉత్కంఠ.. టీవీకే అభ్యర్థిగా లారెన్స్ పేరు?

Tiruchirappalli East Bypoll | తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై ఉత్కంఠ.. టీవీకే అభ్యర్థిగా లారెన్స్ పేరు?

-

Chat on WhatsApp

Tiruchirappalli East Bypoll: తమిళనాడు రాజకీయాల్లో తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ గెలిచిన రెండు స్థానాల్లో ఒకటైన ఈ నియోజకవర్గాన్ని వదిలేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

ఈ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున బరిలోకి దిగే అభ్యర్థి ఎవరు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రారంభంలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్ పేరు బలంగా ప్రచారంలో నిలిచింది. విజయ్‌తో కలిసి పలు సినిమాల్లో నటించిన ఆమె రాజకీయ అరంగేట్రం ఈ స్థానం నుంచే ఉంటుందనే ప్రచారం కూడా సాగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రేసులో అనూహ్యంగా నటుడు, దర్శకుడు, సామాజిక కార్యకర్త రాఘవ లారెన్స్ పేరు ముందుకు వచ్చింది. ఆయన త్వరలోనే టీవీకే పార్టీలో చేరవచ్చని, తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో బరిలోకి దిగవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సీటు పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

ఇక ఇటీవల తిరుచ్చిలో జరిగిన ధన్యవాద సభలో సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. తిరుచ్చి తనకు ఎంతో దగ్గరైన నియోజకవర్గమని పేర్కొన్న ఆయన, ఈ ఉపఎన్నికలో స్థానిక అభ్యర్థికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను బాగా అర్థం చేసుకున్న నాయకుడికే టికెట్ ఇవ్వాలనే సంకేతాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

దీంతో త్రిష లేదా లారెన్స్ వంటి సినీ ప్రముఖులకు టికెట్ దక్కుతుందా లేదా స్థానిక నాయకుడికే అవకాశం ఇస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh meeting Pawan Kalyan during his recovery after shoulder surgery

Nara Lokesh | పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

Nara Lokesh: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని...
- Advertisement -
Chat on WhatsApp